హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం.. ఉరుము లేదు.. మెరుపు లేదు..

హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం.. ఉరుము లేదు.. మెరుపు లేదు..

హైదరాబాద్ సిటీలో మళ్లీ కుండపోత వర్షం.. ఉరుము లేదు.. మెరుపు లేదు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. 2024, ఆగస్ట్ 19వ సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉక్కబోత ఎండ ఉండగా.. 2 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై.. చీకట్లు కమ్మేశాయి. 

హైదరాబాద్ సిటీలోని బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, మెహదీపట్నం, హిమాయత్ నగర్, ఫిల్మ్ నగర్.. నారాయణగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, లక్డికాపుల్ ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది. 

హైదరాబాద్ సిటీలోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం లేదు. కూకట్ పల్లి, మియాపూర్ ఏరియాల్లో ఎండ కాస్తుంది.