ఉగ్రరూపంలో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతుంది. కొండాయి, మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. వరద ఉధృతితో జంపన్న వాగులో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభించాయి. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వరంగల్ వణికిపోయింది. ఎటూ చూసిన పొంగిపోర్లుతున్న చెరువులు, కాల్వలే. ములుగు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. జంపన్న వాగు జల ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఉగ్రరూపంలో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతుంది. కొండాయి, మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. వరద ఉధృతితో జంపన్న వాగులో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభించాయి. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారి వివరాలు, మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది..
ALSO READ:రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్.. కోర్టు కేసుల్లో సర్కారువే ఎక్కువున్నయ్:హైకోర్టు