ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.రానున్న మూడు రోజులు ఉత్తరకోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.వర్షాలు కురిసే సమయంలో 30నుండి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్న, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
తిరుపతి జిల్లాలో ఈరోజు రాత్రి అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి బారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చాలా చోట్ల ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.