
వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు మొదట ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. అనంతరం ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
భర్తీ రద్దీ ఎక్కువగా ఉండడంతో కోడె మొక్కుల కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి టైం పట్టడంతో క్యూలైన్లలో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు.