HYD: లాస్ట్డే.. నుమాయీష్కు పోటెత్తిన జనం.. నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్

HYD: లాస్ట్డే.. నుమాయీష్కు పోటెత్తిన జనం.. నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతోన్న నుమాయీష్ కు లాస్ట్ డే కావడంతో  జనం పోటెత్తారు.  ఫిబ్రవరి 17(సాయంత్రం) వరకు 20  లక్షల మంది నుమాయీష్ ను సందర్శించారు. ఫిబ్రవరి 17న  చివరి రోజు  నుమాయిష్ కు  లక్షకు పైగా  సందర్శకులు వచ్చారు.  దీంతో  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  

ALSO READ | శివరాత్రికి స్పెషల్ బస్సులు .. హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లే భక్తులకి శుభవార్త

 నుమాయీష్  ముంగింపు వేడుకకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్  బెస్ట్ స్టాల్స్ కి బహుమతులు ప్రదానం చేశారు .  ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం.. నుమాయిష్ ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా 46 రోజులు నిర్వహించిన సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.  నుమాయిష్ ను లక్షలాది మంది సందర్శించి ఎంజాయ్ చేశారని చెప్పారు. నుమాయిష్ ద్వారా వచ్చే డబ్బుల ద్వారా 20 విద్యా సంస్థలు నడుస్తున్నాయని తెలిపారు. ఇంకా విద్యా సంస్థలను పెంచుతామన్నారు పొన్నం.  నుమాయిష్ కు ఇంకా ప్రాచుర్యం తెస్తామని చెప్పారు.

46 రోజులు 20 లక్షల మంది

జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్ 46 రోజుల పాటు సాగింది..ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉన్న నుమాయిష్ ను  ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల కోరిక మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఫిబ్రవరి 17 వరకు పొడిగించారు. 1938లో ప్రారంభమైన  నుమాయిష్.. ప్రతియేటా హైదరాబాద్ మహానగరంలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.  నుమాయిష్‎లో ఈ సారి రెండు వేల స్టాళ్లు ఏర్పాటు చేయగా ఎంట్రీ ఫీజును రూ.50గా నిర్ణయించారు. మినీ ట్రైన్‎తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది