శ్రీశైలంలో విపరీతమైన రద్దీ : శివయ్య దర్శనానికి 6 గంటల సమయం

శ్రీశైలంలో విపరీతమైన రద్దీ : శివయ్య దర్శనానికి 6 గంటల సమయం

శ్రీశైల క్షేత్రానికి   భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కన్నడ భక్తులతో శ్రీగిరి క్షేత్రం నిండిపోయింది.  ఈరోజు ( మార్చి 25)  తెల్లవారు జామున వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులు తీరారు. కన్నడ భక్తుల రద్దీతో ఉచిత,శీఘ్ర, అతిశీఘ్ర, స్పర్శ దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

Also Read :  తిరుమల శ్రీవారి సేవలకు.. దర్శనానికి జూన్​ నెల ఆన్​లైన్​ కోటా విడుదల..

మార్చి 27వ తేదీ నుంచి  31 వ తేదీ వరకు శ్రీశై లంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీంతో కన్నడ భక్తులు మల్లన్న స్పర్శదర్శనం చేసుకునేందుకు బారులు తీరుతున్నారు.