- అంతా మంచి జరగాలని కోరుకున్న భక్తులు
న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్‌లోని బిర్లామందిర్, జూబ్లీహిల్స్ టీటీడీ, పెద్దమ్మ తల్లి, బంజారాహిల్స్‌లోని పూరీ జగన్నాథ, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్స్, చిలుకూరు బాలాజీ, సూరారం కట్టమైసమ్మ ఆలయాలకు వేలాదిగా తరలివచ్చారు. స్వామివార్ల దర్శనానికి గంటలపాటు క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది.
ప్రధాన చర్చిల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వందల మంది పాల్గొన్నారు. హాలిడే కావడంతో జూపార్క్, మాదాపూర్శిల్పారామం సందర్శకులతో కిక్కిరిసింది. కోట్‌పల్లి ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.