
కలియుగ వైకుంఠంతిరుమల భక్తజన సంద్రంగా మారింది.. కొండంతా భక్తజనంతో నిండిపోయింది. వరుస సెలవులు కావడం.. పైగా సోమవారం ( ఏప్రిల్ 14 ) తమిళ నూతన సంవత్సరం కావడంతో భక్తజనం తిరుమలకు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు భక్తులు.టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోందని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఆదివారం ( ఏప్రిల్ 13 ) తిరుమల శ్రీవారిని 79వేల100 మంది భక్తులు దర్శించుకోగా.. 32,791 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలుస్తోంది. ఆదివారానికి గాను శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.52 కోట్ల వచ్చినట్లు తెలిపారు టీటీడీ అధికారులు. భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు.
►ALSO READ | మార్క్ శంకర్ పేరిట అన్నదానం.. రూ. 17 లక్షలు అందించిన పవన్ కల్యాణ్, లెజినోవా దంపతులు
రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు , నీళ్ళు, అన్న ప్రసాదాలు పంపిణి చేస్తున్నారు. రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు.