చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత : అల్లు అర్జున్ విచారణతో ఉద్రిక్తం

హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకుని.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన క్రమంలో..  చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భద్రత పెంచారు పోలీసులు. పోలీస్ స్టేషన్ ఎదుట 20 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ ఎత్తున మోహరించారు పోలీసులు.

స్థానిక పోలీసులతోపాటు.. ప్రత్యేక భద్రతా బలగాలు సైతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. చిక్కడపల్లి ఏరియాలో ట్రాఫిక్ ను సైతం పర్యవేక్షిస్తున్నారు

Also Read :- పోలీస్ వాహనంలోనే.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్

 అల్లు అర్జున్​ అరెస్ట్​ మీడియాలో హాట్​ టాపిక్​ గా మారింది.  చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషనుకు తరలించారు.   ఈ క్రమంలో చిక్కడపల్లి పోలీస్​ స్టేషన్​ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.  ఈ క్రమంలో అల్లు అర్జున్​ అభిమానులు.. చిక్కడ పల్లి పోలీస్​ స్టేషనుకు చేరుకుంటున్నారు. ముందస్తు  జాగ్రత్త చర్యగా 300 మంది పోలీసులు చిక్కడపల్లి పోలీస్​ స్టేషన్​ ఏరియాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.