Alert: నిఘా నీడలో హైదరాబాద్​.. ఎందుకంటే

Alert: నిఘా నీడలో  హైదరాబాద్​.. ఎందుకంటే

 ట్రై కమిషనరేట్ల పరిధిలో 35 వేల మంది పోలీసుల మోహరింపు 

బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్‌‌ వరకు జరగనున్న ప్రధాన శోభాయాత్ర నిఘాకు 733 సీసీటీవీ కెమెరాలు, హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు, సరూర్‌‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ సహా గ్రేటర్ పరిధిలో గణనాధులు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో  దాదాపుగా 3800 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌, లక్డీకపూల్‌లోని డీజీపీ ఆఫీస్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలోని కమాండ్‌ కంట్రోల్ సెంటర్స్​తో  అనుసంధానం బంజారాహిల్స్​లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌ లోని మెగాస్క్రీన్​పై ఓవర్‌‌ ఆల్‌ ఫుటేజ్‌ ను పర్యవేక్షిస్తున్నారు.


ప్రధాన శోభాయాత్ర పొడవునా 5 డ్రోన్‌ కెమెరాలు. 125 ప్లాటూన్స్‌ సెంట్రల్ ఫోర్సెస్‌ ..    చార్మినార్,తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌‌, మక్కామజీద్‌ సహా ఓల్డ్​ సిటీలో కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.  హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్‌పై స్పెషల్‌ 
కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.