మేడాం జాతర షురూ అయ్యింది. భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎటూ చూసిన జనసంద్రోహంగా మారింది. ఈ క్రమంలో జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మేడారం జాతర నిర్వహణలో మొత్తం 14వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఐజీ, ఇద్దరు డిఐజీలు, 20మంది SP లు, అధికారులు, 140మంది డీఎస్పీలు, 12 వేల మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 500 సీసీ కెమేరాలు, 15 డ్రోన్ కెమెరాలతో జాతరను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, VIPలు, VVIPల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు
జాతర కోర్ ఏరియాలో పోలీసులు 432 సీసీ కెమెరాలను అమర్చారు. అమ్మవార్ల గద్దెల దగ్గర మొదలుకొని పార్కింగ్ ప్లేస్‌లు, రోడ్లపై, మేడారం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలను బిగించారు. వాహనాలను, భక్తుల సంఖ్యను లెక్కించేందుకు సర్వైలెన్స్ కెమెరాలు, భద్రత కోసం 5 డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. వీటన్నింటిని మేడారంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటల పాటు పనిచేస్తుంది. ఇక్కడ మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన పోలీసులకు క్షణాల్లో తెలిసిపోతుంది. దుకాణాలు, గుడారాలు, గద్దెల వద్ద డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా వన్ వే అమలు చేస్తున్న పోలీసులు.