గంజాయి రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ద్విచక్ర వాహనాల నుంచి లగ్జరీ బస్సులు వరకు దేనిని వదలడం లేదు. తాజాగా ఓ ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం రామాపురం క్రాస్ రోడ్డు ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Also Read :- మహిళా అధికారి హత్య వెనక మైనింగ్ మాఫియా ఉందా..?
BMCC ట్రావెల్స్ బస్ లో లగేజీ బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు ఎస్పీ రాహుల్ హెగ్డే. ముగ్గురు నిందితుల నుంచి 30 వేల నగదు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.