శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం (ఫిబ్రవరి 18) ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అతడి వద్ద రూ.22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది.

Also Read :- మాదాపూర్లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ ఘరానా మోసం

ప్రయాణికుడు నుంచి విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు.. డబ్బును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ తరలిస్తోన్న ప్రయాణికుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తి అమీర్ అహ్మద్‎గా గుర్తించిన అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.