రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం మొదలు కానుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మండే ఎండల నుంచి జాగ్రత్త పడే సమయం వచ్చిందంటూ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ఎండ ప్రభావితం ఎక్కువగా ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని చాలా ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 37°C నుంచి -38°C నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Heat to pick up once again in entire Telangana from today. A strong heat spell ahead in entire Telangana during Feb 17-22 with many parts of Telangana expected to hit max temp of 37-38°C
— Telangana Weatherman (@balaji25_t) February 14, 2024
Hyderabad will witness 36-37°C during the same period
హైదరాబాద్ లోనూ ఎండలు మండిపోనున్నాయి. రాబోయే వారం పది రోజులుగా మండే ఎండలతోపాటు ఎండాకాలం తరహాలో వేడి గాలులు వీయనున్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. చలికాలం పూర్తి కాకుండానే.. ఫిబ్రవరి నెలలోనే వేడిగాలులు వీస్తుండటంతో..జనం భయపడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు.హైదరాబాద్‌లో 36°C - నుంచి 37°C మధ్య ఉండనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఫిబ్రవరి 17 నుంచి -22 ఈ ఆరు రోజుల మధ్య కాలంలో తెలంగాణ అంతటా బలమైన వేడిగాలులు విచే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడింది.