హైదరాబాద్ నాంపల్లిలో గాంధీ భవన్ తీవ్ర ఉద్రిక్త నెలకొంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి నిరసనగా బీజేపీ యువ మోర్చా నాయకులు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలను బీజేపీ ఆఫీస్ దగ్గరకు అనుమతించి.. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ లీడర్స్. బీజేపీ నేతలకు పోటీగా అటు కాం గ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటా పోటీ నిరసనలతో నాంపల్లిలో హై టెన్షన్ నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రెండు పార్టీల ఆందోళనలతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ALSO READ | నాంపల్లి సెంటర్లో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు : అసలు కారణం ఇదీ..!
తొలుత మంగళవారం (జవనరి 7) ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. బీజేపీ నేత రమేష్ బిధూరి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లారు. కాంగ్రెస్ నేతలను బీజేపీ లీడర్స్ అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోటా పోటీగా నిరసనలు చేసుకోవడంతో పాటు కర్రలతో ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో రెండు పార్టీలకు చెందిన నేతలకు తలలు పగిలాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఆఫీస్ ముట్టడికి నిరసనగా బీజేపీ యువ మోర్చ గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు.