శ్రీశైలంలో భారీ ట్రాఫిక్.. కిలోమీటర్ల నిలిచిన వాహనాలు

శ్రీశైలంలో భారీ ట్రాఫిక్.. కిలోమీటర్ల నిలిచిన వాహనాలు

ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు.శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలను భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కొత్త ఏడాది మొదటి రోజున స్వామివారి ఆశీస్సులతో భక్తులు తరలివస్తుంటారు. ఆదివారం (మార్చి30) న భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తులతో శ్రీశైలం ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.  భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో శ్రీశైలంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నూతన సంవ్సతరం ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు భారీ ఎత్తు రావడంతో వాహనాలు రద్దీ పెరిగింది. ఆలయం పార్కింగ్ స్థలం నుంచి 5కిలోమీటర్ల మేర రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. 

ALSO READ | కటక్లో పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు..ఒకరు మృతి..25మందికి గాయాలు