వర్షం తగ్గుముఖం పట్టడం, ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దాంతో, పలు చోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. నగరంలోని పలు కూడళ్లలో ఈ తరహా దృశ్యాలే కనిపిస్తున్నాయి.
సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో వయా బేగంపేట రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, ఈసీఐఎల్, ఘట్ కేసర్, ఏఎస్ రావు నగర్, వెస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్ పరిధిలోని ఉద్యోగులుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకూ వాహనాలే కనిపిస్తున్నాయి.
మెట్రో కిటకిట
రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుండడంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దాంతో, ప్రధాన మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నిల్చోవడానికి కూడా చోటు దొరకనంతలా రద్దీ ఉందని ప్రయణికులు చెప్తున్నారు.