వరంగల్ - హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

యాదాద్రి భువనగిరి జిల్లా: వరంగల్ –హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. దాదాపు కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. 

కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో యాదాద్రి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం నుంచి తిరుగు ప్రయాణాలు మొదలు కావడంతో గూడూరు టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  హైదరాబాద్ వైపు వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి.