శ్రీశైలంలో 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం : ఎక్కడికక్కడ ఆగిన కార్లు

నంద్యాల : శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తారు.. ఫుల్ వాటర్.. దీనికితోడు వీకెండ్.. ఇంకేముందీ.. శ్రీశైలం రద్దీ అమాంతం పెరిగింది. డ్యాం చూడటానికి వచ్చే సందర్శకులు.. సహజంగానే వీకెండ్ రోజుల్లో శ్రీశైలం మహా పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులు.. ఇలా రద్దీ విపరీతంగా పెరిగింది. డ్యాం దగ్గర గేట్లు ఎత్తటంతో.. నీటి ప్రవాహాన్ని చూసేందుకు జనం ఎక్కడపడితే అక్కడ తమ వాహనాలు ఆపేస్తుండటంతో.. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ జాం అయ్యింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నా.. ఎప్పటికప్పుడు భారీగా వస్తున్న వాహనాలతో చాలా నిదానంగా ముందుకు కదులుతున్నాయి వాహనాలు. వ్యూ పాయింట్ నుంచి దోమల పెంట వరకు ఫుల్ ట్రాఫిక్ నెలకొంది. శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తడంతో డ్యామ్ చూసేందుకు పర్యటకుల తాగిడి పెరిగింది. రైయినీ సీజన్ లో నల్లమల్ల అందాలను వీక్షించడానికి టూరిస్టులు క్యూ కడుతున్నారు. మెయిన్ రోడ్డు పక్కనే వాహనాలు నిలిపడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శ్రీశైలం పోలీసులు అవస్థలు పడుతున్నారు.