హైదరాబాద్ సిటీలో భారీగా ట్రాఫిక్ జాం.. ఈ ఏరియాల్లో బీభత్సం

హైదరాబాద్ సిటీలో భారీగా ట్రాఫిక్ జాం.. ఈ ఏరియాల్లో బీభత్సం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో జులై 24న భారీగా ట్రాఫిక్​​ స్తంభించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ చెక్​ పోస్ట్, కేబీఆర్​పార్క్​, జూబ్లీహిల్స్ రోడ్​నంబర్​ 45, 10, పెద్దమ్మ తల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్​ రోడ్ లలో ట్రాఫిక్​ గంటల తరబడి స్తంభించింది. 

దీంతో వాహనాలన్నీ మెల్లిగా కదులుతున్నాయి. ట్రాఫిక్​ పోలీసులు పలు చోట్ల వెహికిల్స్​ని దారి మళ్లిస్తున్నారు. రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. బీహెచ్​ఈఎల్​ చౌరస్తాలో సైతం ఫ్లైఓవర్​ నిర్మాణం కారణంగా భారీగా రద్దీ నెలకొంది.

ఖైరతాబాద్​లో కూడా..

ఖైరతాబాద్​ ఏరియాల్లో కూడా భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. విద్యుత్​సౌధ, కేసీపీ, సీఈవో, నిమ్స్​నుంచి పంజాగుట్ట వైపు ట్రాఫిక్​ రద్దీ చాలా ఉంది.  శ్రీ నగర్ కాలనీ, సుల్తాన్ ఉలూమ్ కళాశాల, చట్నీస్, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి పంజాగుట్ట వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. 

రంగంలోకి దిగిన పోలీసులు పలు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నయ మార్గాలు చూడాలని ట్రాఫిక్​ పోలీసులు సూచిస్తున్నారు. 

భారీ ట్రాఫిక్​ జామ్​తో వాహనదారుల ఇక్కట్లు మామూలుగా లేవు. పలు చోట్ల అత్యవసర వాహనాలు సైతం చిక్కుకున్నాయి. ట్రాఫిక్​ జామ్​కి శాశ్వత పరిష్కారం దొరికేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.