హైదరాబాద్‎లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు

హైదరాబాద్‎లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో వర్షం దంచికొడుతోంది. శనివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత వాన పడటంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు ప్రధాన రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీస్‎లు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో జోరు వాన కురువడంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. 

ALSO READ : హైదరాబాద్‎లో కుండపోత వాన

హైటెక్ సిటి నుండి సికింద్రాబాద్, పంజాగుట్ట నుండి ఎల్బీ నగర్, సికింద్రాబాద్ నుండి ఎల్బీ నగర్ రూట్లలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ లో వర్షపు నీరు రోడ్లపై భారీగా నిలిచిపోయింది. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో కిలో మీటర్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లో తట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వరద నీరు నిలిచే ఏరియాల్లో తొలగింపునకు చర్యలు చేపట్టారు. నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం కురుస్తుండటంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. 

నగరంలోని బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్ బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లక్డీకపూల్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.