ఉదయాన్నే భారీగా ట్రాఫిక్​ జాం.. కిలోమీటరు దూరం వెళ్లాలంటే నరక యాతన

ఉదయాన్నే భారీగా ట్రాఫిక్​ జాం.. కిలోమీటరు దూరం వెళ్లాలంటే నరక యాతన

హైదరాబాద్​ లో సోమవారం ( సెప్టెంబర్​ 16)  పొద్దు పొద్దున్నే ట్రాఫిక్​ జాం అయింది.  కిలో మీటరు దూరం వెళ్లడానికి గంటల తరబడి సమయం పడుతుంది.  ఖైరతాబాద్, లకిడికాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భారీగా వాహనాలు దర్శనమిస్తున్నాయి.   వినాయక నిమజ్జనానికి భారీగా వాహనాలు తరలి వస్తుండటంలో ట్రాఫిక్​ స్థంభించింది. నాంపల్లి , అబిడ్స్ , అసెంబ్లీ, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై ఆగిపోయాయి.  ఈరోజు ఉదయం నుంచే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.  అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. గణేష్​ నిమజ్జనం.. సెలవు కావడంతో ఉదయాన్నే రోడ్లపైకి జనాలు వచ్చారు.

ALSO READ : హైదరాబాద్ లో పెట్రోల్ బంకులో మహిళను కొట్టాడు : ఆ తర్వాత రెండు వర్గాల రచ్చ రచ్చ