హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం(నవంబర్ 26) సెలవు రోజు కావడంతో వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టోల్ ప్లాజా వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు కలసి వాహనాలు తనిఖీ చేస్తుండడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. తనిఖీకి ఒక్కో వాహనాన్ని సుమారు అరగంట పాటు నిలిపివేస్తుండడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో వాహనాల్లో డబ్బు, మద్యం అక్రమంగా తలించకుండా.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.