తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి అబ్లుల్లాపూర్ , కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయింది.
సొంతుళ్లకు వెళ్లే ఓటర్లతో రహదారులు రద్దీగా మారాయి. దీంతో వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ పై కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వెహికల్స్ నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.