నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్..

నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ బోల్తా..  భారీగా ట్రాఫిక్ జామ్..

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ లోడ్ తో వెళ్తున్న రోబో సాండ్ లారీ టైర్ బ్లాస్ట్ కావడంతో బోల్తా కొట్టింది. శుక్రవారం ( నవంబర్ 8, 2024 ) తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదం. ఓవర్ లోడుతో మితి మీరిన వేగంతో వెళ్తుండగా టైర్ బ్లాస్ట్ అవ్వటంతో లారీ పల్టీ కొట్టినట్టు తెలుస్తోంది. అప్ప జంక్షన్ నుండి కోకాపేట్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

పల్టీ కొట్టిన లారీ రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిబ్బంది భారీ క్రేన్ ల సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. మితిమీరిన వేగం, ఓవర్ లోడే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నిత్యం వందలాది లారీలు ఓవర్ లోడుతో, మితిమీరిన వేగంతో వెళ్తుంటాయని.. రవాణా శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు.