పంజాగుట్ట- సికింద్రాబాద్ రూట్లో భారీ ట్రాఫిక్ జామ్

పంజాగుట్ట- సికింద్రాబాద్ రూట్లో భారీ ట్రాఫిక్ జామ్

రెండు గంటలుగా కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ సిటీని ముంచెత్తింది.నగరంలోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధుల్లో మోకాళ్లోతు వరద నీరు చేరింది. రోడ్లు వరదనీటితో కాల్వలను తలపిస్తున్నాయి. పెట్రోల్ బంకులు వరదనీటిలో మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ఇబ్బందులు పడ్డారు. 

పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్కు వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీవర్షం కారణంగా జనజీవనం స్తంభించింది.