మేడ్చల్: కుత్భుల్లాపూర్ పరిధిలోని షాపూర్, గాజుల రామారం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.దీంతో బాలానగర్ డీసీపీ ఆఫీసు ముందు భారీగావాహనాలు నిలిచిపోయాయి. ఆటోలు పెరుగుతుండటంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా మారుతోందని దీంతో ట్రాఫిక్ జామ్ తరుచుగా అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. శుక్రవారం ( సెప్టెంబర్ 20) సాయంత్రం కూడా ట్రాఫిక్ జామ్ జరిగింది. దీంతోవాహనదారులు తీవ్రఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ వాహనాలను క్లియర్ చేశారు.