
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్లపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తెలంగాణలో సలేశ్వరం జాతర ఉండటంతో అటు శ్రీశైలం, ఇటు సలేశ్వరం దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శని, ఆది, సోమ (ఏప్రిల్ 12,13,14) వరుస సెలవులు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా భక్తులు రావడంతో శ్రీశైలం దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.
ముందుగా సలేశ్వరం జాతర ముగించుకుని ఆ తర్వాత శ్రీశైలం ఆలయ దర్శనానికి భక్తులు వెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సలేశ్వరం నుంచి శ్రీశైలం వెళుతున్న క్రమంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తు్న్నారు.