దసరా ఎఫెక్ట్: పల్లెబాట పట్టిన హైదరాబాద్.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

దసరా ఎఫెక్ట్: పల్లెబాట పట్టిన హైదరాబాద్.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

దసరా పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెలకు బయలుదేరారు.. ఈ క్రమంలో హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అయ్యి.. పలు చోట్ల రోడ్లపై కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా జనం పల్లెలలకు బయలుదేరటంతో విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కార్లపాడు గ్రామం దగ్గర విజయవాడ వైపుకు వెళ్లే మార్గంలో ఆరు టోల్ బూతులను సిద్ధం చేశారు టోల్గేట్స్ సిబ్బంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ (విఐపి, అంబులెన్స్) కోసం ఏడవ టోల్ బూతు ను ఏర్పాటు చేశారు.

దసరా సందర్బంగా వరుస సెలవులు రావటంతో చాలామంది హైదరాబాద్ నుండి సొంతూళ్లకు బయలుదేరారు. ట్రాఫిక్ మరింత పెరిగే సూచనలున్న క్రమంలో జాతీయ రహదారిపై  అవసరమైతే ఇంకొక రెండు టోల్ బూత్ లను తెరిచే అవకాశం ఉన్నట్లుగా టోల్గేట్ సిబ్బంది తెలిపారు.