ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో భారీగా గంజాయి రవాణా...

ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో భారీగా గంజాయి రవాణా...

గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఎంత కఠినమైన చర్య,లు తీసుకుంటున్నప్పటికీ ఎదో ఒక మార్గంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ కేంద్రంగా ఇతర రాష్ట్రాల నుండి యథేచ్ఛగా సాగుతున్న గంజాయి రవాణాను సిటీ పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నారు. తాజాగా ఒరిస్సా నుండి హైదరాబాద్ కు భారీగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మేడ్చల్ డీసీపీ జోన్ పరిధిలోని శామీర్పేట్ లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Also Read :- టార్గెట్ ప్రభాస్ ఎందుకు

ఒరిస్సా నుంచి నగరానికి గుట్టు చప్పుడు కాకుండా ప్యాకెర్స్ మూవర్స్ కార్గో లో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. శామీర్పేట్, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో 242కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.