కరీంనగర్ లోని లోయర్ మానేర్ డ్యామ్ జలకళ సంతరించుకోబోతుంది. మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేసి లోయర్ మానేర్ నింపుతున్నారు. రెండుగేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీకి విడుదల చేశారు. లోయర్ మానేర్ లో నీటిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడారిని తలపిస్తున్న కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ జలకళను సంతరించుకోబోతుంది. మిడ్ మానేర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటి మట్టం చేరడంతో నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.903 నీరు చేరింది. ప్రాజెక్ట్ నీటి మట్టం 919.85 అడుగులు కాగా.. ప్రస్తుతం 920 అడుగులకు నీరు చేరింది.
ALSO READ : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటు.. 4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత