నిండుకుండలా లోయర్ మానేరు.. సెప్టెంబర్ 10న రాత్రి గేట్లు ఎత్తే చాన్స్

నిండుకుండలా లోయర్ మానేరు.. సెప్టెంబర్ 10న రాత్రి గేట్లు ఎత్తే చాన్స్

కరీంనగర్ : భారీగా వరద నీరు, మిడ్ మానేరు జలాలు వచ్చి చేరుతుండటంతో లోయర్ మానేరు డ్యామ్ నిండు కుండలా మారింది. గడిచిన 15 రోజుల్లోనే ఎల్ఎండీ పూర్తి జలకళను సంతరించుకుంది. భారీ వర్షాల వల్ల మోయ తుమ్మెద వాగు వరద, మిడ్ మానేరు నుంచి నీరు వచ్చి చేరుతుండగా..  సోమవారం అర్ధరాత్రి వరకు ఎల్ఎండీలో 23 టీఎంసీలకు నీటిమట్టం పెరిగింది.

 ప్రస్తుతం మిడ్ మానేరు నుంచి 10,300 క్యూసెక్కుల వరద , మోయ తుమ్మెద వాగు నుంచి 673 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఇలాగే కొనసాగితే మంగళవారం అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయి నీటి మట్టానికి ఎల్ఎండీ చేరనుంది. దీంతో మిడ్ మానేరు నుంచి నీటి విడుదల ఆపడమా.. లేదంటే వరద ఉధృతమైతే వెంటనే గేట్లు ఎత్తేసేందుకు ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.