క్యూరియాసిటీని పెంచేస్తోన్నహెబ్బా పటేల్ కొత్త మూవీ పోస్టర్

డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ ఫిమేల్‌‌ లీడ్‌‌గా మెప్పిస్తోంది హెబ్బా పటేల్. తాజాగామిస్టరీ థ్రిల్లర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో   విప్లవ్ కోనేటి దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’. అక్టోబర్ 6న ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. మ‌‌ద‌‌న‌‌ప‌‌ల్లిలో జ‌‌రిగిన వాస్తవ ఘ‌‌ట‌‌న‌‌ల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.  స‌‌స్పెన్స్, డ్రామా, రొమాన్స్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.  రామ్ కార్తిక్, నరేష్, పవిత్రా లోకేష్, జయ ప్రకాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.