
‘ఓదెల 2’ చిత్రం ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని హెబ్బా పటేల్ చెప్పింది. తమన్నా లీడ్ రోల్‌లో సంపత్ నంది నిర్మించిన ఈ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషించింది. గతంలో హెబ్బా నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’కు ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 17న సినిమా విడుదల సందర్భంగా హెబ్బాపటేల్ మాట్లాడుతూ ‘లాక్‌డౌన్ టైమ్‌లో ఒక చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ గొప్ప విజయాన్ని అందుకుని, దానికి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ వస్తుండడం ఆనందంగా ఉంది.
అదొక మర్డర్ మిస్టరీ సినిమా అయితే.. ఈ సీక్వెల్ ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఇందులో నేను ఎక్కువ శాతం జైలు సీన్స్‌లో కనిపిస్తా. ఇందులోనూ నా క్యారెక్టర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నాకు సిస్టర్ పాత్రలో తమన్నా కనిపిస్తారు. తనతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఇందులోని పాత్ర కోసం తమన్నా ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. నిజానికి ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు నేను అంతగా ప్రిపేర్ కాలేదు. తమన్నా గారిలా నేనెప్పుడూ హోంవర్క్ చేయలేదు.
ఇకపై అలాంటి హోంవర్క్ చేయాలని ఆమె నుంచి నేర్చుకున్నా. ‘ఓదెల రైల్వేస్టేషన్’తో నేను అన్నిరకాల పాత్రలు చేయగలననే నమ్మకాన్ని సంపత్‌నంది ఇచ్చారు. ఆయనతో మరోసారి వర్క్ చేయడం హ్యాపీ. పదేళ్ల జర్నీలో చాలా జానర్స్ ట్రై చేశా. అయితే ఓ పూర్తిస్థాయి కామెడీ క్యారెక్టర్‌లో నటించాలనే కోరిక తీరలేదు. ఇక తెలుగులో నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అలాగే ఓ కన్నడ సినిమాలో కూడా నటిస్తున్నా’ అని చెప్పింది.