Ala Ninnu Cheri Review : హెబ్బాప‌టేల్‌ ల‌వ్ స్టోరీ.. అలా నిన్ను చేరి మూవీ రివ్యూ

Ala Ninnu Cheri Review : హెబ్బాప‌టేల్‌ ల‌వ్ స్టోరీ.. అలా నిన్ను చేరి మూవీ రివ్యూ

యూత్‌ఫుల్ ట్రైయాంగిల్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన మూవీ అలా నిన్ను చేరి (Ala Ninnu Cheri ). ఈ మూవీ ఇవాళ (నవంబర్10) శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. దినేష్ తేజ్(Dinesh Tej) హీరోగా నటించిన ఈ మూవీలో హెబ్బాప‌టేల్‌(Hebha Patel), పాయ‌ల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) హీరోయిన్లుగా క‌నిపించారు. మారేష్ శివ‌న్ (Maresh Shivan) డైరెక్ట్ చేసిన ఈ యూత్‌ఫుల్ లవ్స్టోరీ ఎలా ఆకట్టుకుందో ఒక లుక్కేద్దాం. 

కథ : 

విశాఖ‌ప‌ట్నంలోని మారుమూల గ్రామం వెంకటాపురంకి  చెందిన గణేష్‌(దినేష్‌ తేజ్‌) సినిమాలపై పిచ్చి తో ఎలాగైనా..ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని కలలు  కంటుంటాడు. అటువంటి క్రమంలో అదే గ్రామానికి చెందిన దివ్య (పాయల్‌ రాధాకృష్ణ)తో ప్రేమలో పడి..తన కెరీర్ పై ఫోకస్ తగ్గిపోతూ వస్తోంది. గణేష్ కు దివ్య మధ్య సాగించే లవ్ స్టోరీ..కుటుంబాల వరకు వెళుతుంది. దీంతో దివ్య తల్లి కనకం (ఝాన్సీ) వీరి ప్రేమకు అడ్డు చెపుతుంది. ఇక తన కూతుర్ని బంధువైన కాళీ(శత్రు)కు ఇచ్చి మ్యారేజ్ చేయాలనీ డిసైడ్ అవుతుంది. 

ఎలాగైనా కాళీతో పెళ్లి జరగకుండా..ఆపాలని దివ్య ఎంత వేడుకున్న గ‌ణేష్ మాత్రం ప‌ట్టించుకోడు. ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యం ముందు..పెళ్లి ముఖ్యం కాదనుకుని హైద‌రాబాద్ వెళ‌తాడు. మరి సినిమా తీయాలన్న గణేష్‌ లక్ష్యం నెరవేరిందా? ఊర్లో కాళీతో కుదుర్చుకున్న దివ్య పెళ్లి జరిగిందా? లేదా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతున్నా..గణేష్‌ ఎందుకు ఆపలేకపోయాడు? హైదరాబాద్‌లో గణేష్‌ పడిన కష్టాలేంటి? అన్న విషయాలతో ముందుకు సాగే గణేష్ జీవితంలోకి అను(హైబ్బా పటేల్‌) ఎలా వచ్చింది? ఇక అనుకి గణేశ్‌ మధ్య ఏర్పడిన పరిచయం ఎంతవరకు వెళుతుంది? చివరికి గణేష్ లైఫ్ ఎలా మారింది? అతను ప్రాణం కంటే..ఎక్కువగా ప్రేమించిన దివ్య..తనను ఇష్టపడిన అమ్మాయి అను..ఇద్దరి మధ్య డైరెక్టర్ అవ్వాలనే ప్రయత్నం..ఎంతవరకు రీచ్ అవ్వగలిగాడో.. తెలియాలంటే అలా నిన్ను చేరి మూవీనీ థియేటర్లో చూడాల్సిందే.

కథ విశ్లేషణ: 

ప్రస్తుత కాలంలో యువకులు కనే కలల మధ్య..ఓ పక్కన లక్ష్యం..మరో పక్కన ప్రేమ‌. ఈ రెండింటి మధ్య ఎటూ తేల్చుకోలేక  తనలో తానూ సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌య్యే ఓ యువ‌కుడి క‌థ‌కు..యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ను జోడించి ద‌ర్శ‌కుడు మారేష్ శివ‌న్ మూవీని చక్కగా తెరకెక్కించాడు. అలాగే అప్‌క‌మింగ్ డైరెక్ట‌ర్ల‌కు ప్రస్తుత ఇండ‌స్ట్రీలో..ఎదురయ్యే ప‌రిస్థితులు ఎలాంటివో..వాటి మధ్యన నిలబడి బ్యాక్ గ్రౌండ్ లేని యువకుడు ఎలా నిలదొక్కుకున్నాడో చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇక ఫ‌స్ట్ హాఫ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ అందాలు..హీరోయిన్ దివ్య చక్కని అభినయం..వీరి మధ్య నడిచే ప్రేమ ఆకట్టుకుంటోంది. దివ్య ను ప్రపోజ్ చేసే సీన్ చాలా కొత్త ఫీలింగ్ ను ఇచ్చేలా డైరెక్టర్ చూపించాడు.

అలాగే ఫస్టాఫ్ లో వచ్చే పాటలు ఫ్రెష్ ఫీలింగ్ ను ఇస్తాయి. సెకండాఫ్ విషయానికి వస్తే..స్టోరీ పల్లెటూరి నుండి సిటీ నేప‌థ్యంలో సాగుతుంది. అక్కడ పరిచయమైన అను..గణేష్ ల ప్రేమ సినిమాటిక్ లెవెల్లో సాగుతూ..రొమాంటిక్ సైడ్ టర్న్ అవుతుంది. మధ్య మధ్యలో సినిమా ఛాన్స్ ల కోసం గణేష్ చేసే ప్రయత్నాలు ఫర్వాలేదనిపిస్తుంది. కానీ ఫ్రీ క్లైమాక్స్‌ నుంచి కథ ఎమోషనల్‌ టర్న్ తీసుకుంటోంది. దీంతో కథలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సినిమా క్లైమాక్స్ చేరే కొద్దీ..ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగిస్తాడు డైరెక్టర్. కానీ, గణేష్ తను డైరెక్టర్ అవ్వాలనుకునే..ఎపిసోడ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉండింటే..సినిమా మరింత  ఆకుట్టుకుని ఉండేది. అలాగే అనుతో గణేష్ సాగించే లవ్ స్టోరీ మధ్య.. అంత ఇంటెన్సిటీని కలిగించదనే ఫీలింగ్ ను ఇస్తుంది. 

ఎవరెలా చేశారంటే..

మిడిల్‌ క్లాస్‌ యువకుడిలా కనిపించే గణేష్‌ క్యారెక్టర్ కు హీరో దినేష్‌ తేజ్‌ న్యాయం చేశాడు. తన నటనతో, ఎమోషన్స్ తో, డ్యాన్స్‌, యాక్షన్స్‌తో చక్కని ప్రతిభ కనబరిచాడు.అలాగే  పల్లెటూరి అమ్మాయిదివ్య క్యారెక్టర్ లో పాయల్‌ రాధాకృష్ణ చక్కని అభినయం కనబరిచింది. తన కెరీర్ లో ఇది ఫస్ట్ ఫిల్మ్ అయిన ..ఎక్కడ తడబడకుండా..థన్ అపాత్రకు న్యాయం చేసింది. ఎమోషన్స్ తో అందిఅయిన్స్ ను మెప్పించింది. అలాగే అను క్యారెక్టర్ లో నటించిన హెబ్బా పటేల్‌ పూర్తి న్యాయం చేసింది.మోడర్న్ గర్ల్ ల కనిపించే తన లుక్స్, యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోతారు. సెకండాఫ్ స్టోరీ మొత్తం హెబ్బా చుట్టే తిరుగుతుంది.అలాగే క్యారెక్టర్ ఆర్టిసులు .. రంగస్థలం మహేశ్‌, చమ్మక్‌ చంద్ర, ఝాన్సీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.

టెక్నిషియన్స్ :

డైరెక్టర్ మారేష్ శివన్ ఎంచుకున్న స్టోరీ పాయింట్ కొత్తదేమీ కాకపోయిన ..ప్రతి యువకుడి లైఫ్ లో ఎదురయ్యే అంశం కాబట్టి..చాలా చక్కగా తెరకెక్కించాడు.ఇటువంటి ప్రేమ‌క‌థ‌ల‌తో ఆడియెన్స్‌ను మెప్పించ‌డం.. ఏ డైరెక్టర్ కి అయిన క‌త్తిమీద సాములాంటింది. ఈ క‌థ‌ల్ని రొటీన్ ఫార్మెట్‌లో కాకుండా..ఆడియన్స్ దృష్టిలో కొత్త‌గా చెప్పే సాహసం..ఆ మేకింగ్ ద‌ర్శ‌కుడిలో ఉండాలి. ఈ విష‌యంలో మారేష్ శివ‌న్ కొంత మేరకు స‌క్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు.

అక్కడక్కడ క‌థ‌గ‌మ‌నం స్లోగా వెళ్లడం వల్ల ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశాడు. అలాగే ల‌క్ష్యం కోసం హీరో సాగించే..జ‌ర్నీ చాలా వరకు ఆలోచింపజేసేలా ఉంది. ఇటువంటి సీన్స్ ను మరింత డెప్త్‌గా రాసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. పల్లెటూర్లో సుభాష్‌ ఆనంద్‌ అందించిన మ్యూజిక్..ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. చంద్రబోస్‌ సాహిత్యం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. కోడి బాయే లచ్చమ్మ పాటతో పాటు..లవ్ ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. అండ్రూ సినిమాటోగ్రఫీ..ఈ మూవీకి రిచ్‌ నెస్ తీసుకొచ్చింది.