హీరా గోల్డ్‌ కుంభకోణం కేసు.. ముగిసిన ఈడీ దర్యాప్తు

హీరా గోల్డ్‌ కుంభకోణం కేసు.. ముగిసిన ఈడీ దర్యాప్తు

కొన్ని రోజులుగా హీరా గోల్డ్‌ కుంభకోణంపై ఈడీ చేస్తోన్న దర్యాప్తు ఇవాళ్టితో ముగిసింది. తాజాగా ఈ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోమవారం సోదాలు నిర్వహించింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌తో పాటు, తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి ఐదు చోట్ల సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హీరో గోల్డ్ అధిపతి, నౌహీరా షేక్‌ రూ. 400 కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని సోదాలో గుర్తించామనిఈడీ అధికారులు తెలిపారు.

నౌహీరా షేక్‌, వివిధ స్కీమ్‌ల పేరుతో వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి ఎంతో మందిని మోసగించారన్న ఆరోపణలతో దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సోదాల్లో 90 లక్షల నగదు, 12 కొత్త లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 25 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల పేపర్లను, నౌహీరా షేక్‌ పేరు మీదున్న 13 ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకొని ఆమెని అరెస్ట్ చేశామన్నారు. కాగా నౌహీరా షేక్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా 60కిపైగా కేసులు నమోదయ్యాయి.