హీరా మండి సీజన్ 2 అనౌన్స్

హీరా మండి సీజన్ 2 అనౌన్స్

సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆయన రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రూపొందించిన ‘హీరా మండి’ వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్ నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. తాజాగా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు సీక్వెల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు. ‘హీరా మండి’ సీజన్ 2 అంటూ సోమవారం అనౌన్స్ చేశారు.  మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రీచా చద్ధా, సంజీదా షేక్‌‌‌‌‌‌‌‌, షర్మిన్‌‌‌‌‌‌‌‌ సెగల్‌‌‌‌‌‌‌‌లు ఇందులోనూ కనిపించబోతున్నట్టు తిరిగి అదే పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీక్వెల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించడంతో దీనిపై అంచనాలు పెరిగాయి.  

భారత్ , పాకిస్తాన్ విభజనకు ముందు లాహోర్ దగ్గరలోని షాహి మొహల్లా ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఫస్ట్ సీజన్‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. సెకండ్ సీజన్‌‌‌‌‌‌‌‌లో వేశ్యలందరూ లాహోర్ వదిలి సినీ పరిశ్రమకు వస్తారని, దేశ విభజన సమయంలో వారందరూ ముంబయి, కోల్‌‌‌‌‌‌‌‌కతా వెళ్లిపోవడం చూపించనున్నట్టు సంజయ్ లీలా భన్సాలీ తెలియజేశారు.