Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌.. తుది జట్టు నుంచి క్లాసన్‌ను తప్పించిన సౌతాఫ్రికా

Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌.. తుది జట్టు నుంచి క్లాసన్‌ను తప్పించిన సౌతాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 21) సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. టాస్ గెలిచి సఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే తుది జట్టులో ఆశ్చర్యంగా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే క్లాసన్ తుది జట్టులో ఎందుకు లేడో ఇప్పుడు చూద్దాం. 

ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ కు ముందు క్లాసన్ మోచేతి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ కారణంగా క్లాసెన్ టోర్నమెంట్‌ ప్రారంభ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ సౌతాఫ్రికా వికెట్ కీపర్ గాయంపై ఎలాంటి అప్ డేట్ లేదు. అతను మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడో లేదో ఎలాంటి క్లారిటీ లేదు. టాస్ సమయంలో కూడా బావుమా క్లాసన్ గాయం నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ గాయం తీరమైతే ఈ విధ్వంసకర ఆటగాడు టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. 

ALSO READ | Sourav Ganguly: గంగూలీకి తృటిలో తప్పిన ప్రమాదం.. కారు ప్రమాదానికి గురైన భారత క్రికెటర్లు వీరే

కొంత కాలంగా క్లాసన్ వన్డేల్లో టాప్ ఫామ్ ఉన్నాడు. ఇటీవలే జరిగిన ట్రై సిరీస్ లోనూ మెరుపు హా సెంచరీ చేసి రాణించాడు. క్లాసన్ లాంటి మ్యాచ్ విన్నర్ దూరమవ్వడం సౌతాఫ్రికాపై పెద్ద ఎదురు దెబ్బే. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా తొలి 15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ఓపెనర్ రికెల్ టన్ (50) తో పాటు కెప్టెన్ బావుమా (22) క్రీజ్ లో ఉన్నాడు. టోనీ డి జోర్జీ 11 పరుగులు చేసి నబీ బౌలింగ్ లో ఔటయ్యాడు.