ఐపీఎల్ 2025 కోసం సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్స్ జాబితాలో హార్డ్ హిట్టర్ క్లాసెన్‌ను తొలి ఆప్షన్‌గా తీసుకొని అతనికి రూ. 23 కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగా ఆక్షన్ కు ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో ఇదే అత్యధిక మొత్తం. క్లాసన్ సన్ రైజర్స్ తరపున రెండు సీజన్ లు గా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. జట్టులో మిగిలిన ఆటగాళ్లు విఫలమైనా ఒక్కడే వారియర్ లా పోరాడిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. దీంతో ఈ సఫారీ ఆటగాడికి అన్ని కోట్లు ఇవ్వడంలో న్యాయం ఉందంటున్నారు నెటిజన్స్. అయితే ప్రస్తుతం క్లాసన్ పరిస్థితి ఫామ్ ఘోరంగా ఉంది.
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు సొంత లీగ్ అయినటువంటి సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఈ సఫారీ స్టార్ బ్యాటర్ 4 మ్యాచ్ ల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. డర్బన్ సూపర్ జయింట్స్ తరపున ఆడుతున్న అతని జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సఫారీ స్టార్ విఫలం కావడం జట్టు పరాజయలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్క మ్యాచ్ లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. సొంత లీగ్ లోనే విఫలమవుతుంటే మరో రెండు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ సమయానికి ఫామ్ లోకి వస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 23 కోట్లు పెట్టి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న క్లాసన్ ఆడకపోతే సన్ రైజర్స్ భారీగా నష్టపోయినట్టే. మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో మిడిల్ ఆర్డర్ లో క్లాసన్ పై సన్ రైజర్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. టాపార్డర్ బలంగా ఉన్నప్పటికీ.. బలహీనంగా ఉన్న మిడిల్ ఆర్డర్ భారం క్లాసన్ మోయాల్సిందే. క్లాసన్ తో పాటు సన్ రైజర్స్ కమిన్స్‌కు 18 కోట్లు, అభిషేక్ 14 కోట్లు, హెడ్‌కు 14 కోట్లు యంగ్‌స్టర్ నితీశ్‌ను రూ. 6 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఈ ఐదుగురి కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేయడం విశేషం.
Heinrich Klaasen Form in SA20
— Junaid Khan (@JunaidKhanation) January 19, 2025
⭐️ 8(10) vs SEC
⭐️ 1(5) vs SEC
⭐️ 29(17) vs JSK
⭐️ 0(2) vs PC
Did He Purposely Underperform Against His IPL Team Sunrisers ?? pic.twitter.com/ckU5g0FOMK