CPL 2024: కరేబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్

CPL 2024: కరేబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్, సన్ రైజర్స్ విధ్వంసకర ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ నుండి వైదొలిగాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. క్లాసన్ కరీబియన్ లీగ్ లో    సెయింట్ లూసియా కింగ్స్ తరపున ఆడాల్సి ఉంది. ఈ జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ చేస్తున్నాడు. క్లాసన్ దూరం కావడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ టాప్-ఆర్డర్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ ను జట్టులోకి తీసుకున్నారు. 

సీఫెర్ట్‌ కు కరీబియన్ లీగ్ లో ఆడిన అనుభవం ఉంది.  2020 లో అతను ఆడిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ టైటిల్ గెలుచుకుంది. 2020-2022 మధ్య 33 మ్యాచ్ ల్లో ఆడిన ఈ కివీస్ బ్యాటర్ 531 పరుగులు చేశాడు. ఇక క్లాసన్ విషయానికి వస్తే ఒకప్పుడు ఈ లీగ్ లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ప్రస్తుత సీజన్ లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టులోకి వచ్చాడు. రెండేళ్లుగా క్లాసన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో ఇతని విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే.    

క్లాసన్ తో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు ఈ లీగ్ కు దూరమయ్యారు. భుజం గాయం కారణంగా సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్ తరపున ఆడుతున్న జింబాబ్వే ఆల్ రౌండర్  సికందర్ రజా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో ఇంకా ఎవరు ఎంపిక కాలేదు. బార్బడోస్ రాయల్స్ తరపున ఆడుతున్న కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్ ప్రారంభ మ్యాచ్ లను కోల్పోనున్నారు. 

సెయింట్ లూసియా కింగ్స్ స్క్వాడ్:

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, నూర్ అహ్మద్, డేవిడ్ వైస్, భానుకా రాజపక్స, మాథ్యూ ఫోర్డే, ఆరోన్ జోన్స్, ఖరీ పియర్, ఖరీ కాంప్‌బెల్, జోహన్ జెరెమియా, షడ్రాక్ డెస్కార్ట్, మిక్కెల్ గోవియా, క్లార్క్, అకీమ్ అగస్టే, టిమ్ సీఫెర్ట్