H1B visa: ట్రంప్ రాక..ఆందోళనలో H1B వీసాహోల్డర్లు!

H1B visa: ట్రంప్ రాక..ఆందోళనలో H1B వీసాహోల్డర్లు!

H1B వీసా..ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత.. H1B వీసా హోల్డర్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా జనవరి 20 అంటే ఇవాళ అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేస్తున్నందున H1B వీసా హోల్డర్లలో మరింత పెరిగింది. ఎందుకంటే.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనూ.. గెలిచిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్న వలసదారులపై ప్రతికూల ప్రకటనలు చేయడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మార్పుల చేస్తామనడం ఇందుకు కారణం. 

చాలామంది భారతీయులు అమెరికాలో చదువుకోవాలి.. స్థిరపడాలి అని కోరుకుంటారు. అలాంటి వారికి అమెరికా H1B వీసాలను జారీ చేస్తుంది.. ప్రపంచ దేశాలకు అమెరికా జారీ చేసే H1B వీసాల్లో దాదాపు 72 శాతం ఇండియన్స్ వినియోగించుకుంటున్నారని అమెరికన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్ రాకతో.. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులతో.. H1B వీసా హోల్డర్లకు, ఇకముందు వీసా పొందాలనుకునే భారతీయులకు కొంత ఇబ్బంది కలిగి అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. 

Also Read :- టిక్ టాక్లో అమెరికా పెట్టుబడులు

H1B వీసా.. నైపుణ్యం కలిగిని విదేశీ పౌరులకు అమెరికా జారీ చేసే తాత్కాలిక వీసా ఇది. H1B  వీసా పొంది అమెరికాకు వెళ్లిన వారానికి అక్కడ ఉండేందుకు 6 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది.. ఇందులో మొదట మూడు సంవత్సరాలు.. ఆ తర్వాత పొడిగింపుగా మరో మూడేళ్లు అక్కడ ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. అమెరికా జారీ చేసే 72శాతం H-1B వీసాలను భారతీయులు కలిగి ఉన్నారు. ఇది ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపుతారు. 

వలసదారులుగా భారతీయులు మెక్సికో అత్యధికంగా ఉన్నారు. తర్వాత అమెరికాలో ఉన్నారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత H1B వీసాల విషయంలో మరిన్ని మార్పులు, వీసాల తగ్గింపు వంటి హామీలు ఇవ్వడంతో భయపడుతున్నారు.