Hurricane Cyclone : హరికేన్ విధ్వంసం.. 44 మంది మృతి

Hurricane Cyclone : హరికేన్ విధ్వంసం.. 44 మంది మృతి

అమెరికాలో హెలెన్ హరికేన్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా,నార్త్ కరోలినా, సౌత్ కరోలి రాష్ట్రాల్లో  కేటగిరి- 4 హరికేన్‌  తుఫాన్  ప్రభావం ఎక్కువగా ఉంది. ఇళ్ల పై కప్పులు లేచిపోయాయి.. మరి కొన్ని ఇళ్లు  కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. టెలిఫోన్ స్థంబాలు, చెట్లు విరిగిపడ్డాయి.   

ఈ తుఫాన్ దాటికి 44 మంది మృతిచెందారు. మరణించిన వారిలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ..నెల వయసున్న  చిన్నారి,  89 ఏళ్ల వృద్ధురాలు ఉంది.   దాదాపు  15 బిలియన్ డాలర్ల నుంచి 26 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు అక్కడి అధికారులు.

ఫ్లోరిడాలో తుఫాన్ తీరం దాటేటప్పుడు 225 కి.మీ వేగంతో గాలులు వీచాయి. అట్లాంటాలో 48 గంటల్లో  28 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.  జార్జియాలోని చాలా ఆస్పత్రల్లో ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది  తుఫాన్ కారణంగా స్కూళ్లు, యూనివర్శిటీలకు సెలవులు ప్రకటించారు..ఫ్లోరిడాలో బలమైన గాలుల వల్ల దాదాపు 10 లక్షల వ్యాపార సముదాయాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 

పలు విమానాలు రద్దు చేయబడ్డాయి. 3,300  విమానాలు ఆలస్యం అయ్యాయి.అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. యునికో కౌంటీ ఆస్పత్రి నుంచి హెలికాప్టర్ సహాయంతో   దాదాపు 50 మందిని కాపాడారు. టెనస్సీ న్యూపోర్ట్ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.