యాదగిరి గుట్టపై ఆగిన హెలికాప్టర్.. ఎందుకంటే

యాదగిరి గుట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద ఇంధన సమస్యతో  ఓ హెలికాప్టర్ కొద్ది సమయం ల్యాండ్ అయింది. . మార్గంమధ్యలో ఇంధనం అయిపోవడంతో హెలికాప్టర్ మహబూబాబాద్ నుంచి హైదరాబాద్  వెళ్లే క్రమంలో  అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన ఈ రోజు ( జూన్ 18)  చోటు చేసుకుంది.పెద్దగుట్టపై 20 నిమిషాలు ఆగిన హెలికాప్టర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ కవిత, అధికారులు ఉన్నారు. తరువాత కొద్ది సేపటికి ఇంధనం నింపుకొని హైదరాబాద్ కు బయలుదేరింది.