పుణెలో హెలికాప్టర్ క్రాష్..ప్రయాణికులు సేఫ్​

పుణెలో హెలికాప్టర్ క్రాష్..ప్రయాణికులు సేఫ్​

పుణె: మహారాష్ట్రలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పుణెలోని పౌద్‌‌‌‌ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్‌‌‌‌  కూలిపోయింది. గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందిన ఏడబ్ల్యూ-–139 ఛాపర్  ముంబై నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. బలమైన గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ఛాపర్ లో నలుగురు ప్రయాణికులున్నారు. 

అదృష్టవశాత్తు వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు. కెప్టెన్ కు తీవ్ర గాయాలు కాగా అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తును కొనసాగిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. మే నెలలోనూ ఓ హెలికాప్టర్ కూలిపోయింది. శివసేన నాయకురాలు సుష్మా అంధారేను తీసుకెళ్లేందుకు వచ్చిన ఛాపర్ ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, అతడి హెల్పర్ క్షేమంగా బయటపడ్డారు.