మియామీలో హెలికాప్టర్ ప్రమాదం.. వీడియో వైరల్

అమెరికా ఫ్లోరిడాలోని మియామీ బీచ్లో శనివారం హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. రద్దీగా ఉన్న బీచ్లో హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. మధ్యాహ్నం 1.10గంటల సమయంలో ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న రాబిన్సన్ ఆర్44 హెలికాప్టర్ మియామీ బీచ్లో  కూలిపోయింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న, మియామీ బీచ్ ఫైర్ స్టేషన్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని దగ్గరలోని జాక్సన్ మెమోరియల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. హెలికాప్టర్ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు ప్రారంభించింది.

మరిన్ని వార్తల కోసం..

చావడానికైనా సిద్ధమే కానీ తలవంచను

ప‌టియాలాలో నా గెలుపు ఖాయం