న్యూయార్క్ లో ఘోరం: నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి..

న్యూయార్క్ లో ఘోరం: నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి..

న్యూయార్క్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. నగరంలోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలింది. గింగిరాలు తిరుగుతూ హెలికాప్టర్ నదిలో కూలిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. న్యూయార్క్ కాలమాన ప్రకారం గురువారం ( ఏప్రిల్ 10 )మధ్యాహ్నం 3:17 గంటల సమయంలో హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ పైలట్ సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.  

ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు ఉండగా..మృతులు స్పెయిన్‌లోని సిమెన్స్ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, వారి ముగ్గురు పిల్లలుగా గుర్తించారు అధికారులు. హెలికాప్టర్ న్యూయార్క్ డౌన్‌టౌన్ మాన్‌హట్టన్ హెలిపోర్ట్ నుండి బయలుదేరినట్టు తెలిపారు అధికారులు.

 

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి సహాయక బృందాలు. బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టింది అగ్నిమాపక సిబ్బంది. హెలికాప్టర్ తలకిందులుగా పడి.. పూర్తిగా నీటిలో కూరుకుపోయినట్లు తెలిపారు అధికారులు. గాల్లో ఉండగానే హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

హెలికాప్టర్ నుంచి రోటర్ బ్లేడ్ విడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోల్లో  విమానం భాగాలు విరిగిపోవడం, అది నీటిలో కూలిడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ప్రమాదం కారణంగా వెస్ట్ సైడ్ హైవే, స్ప్రింగ్ స్ట్రీట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.