కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. ఆ ప్రాజెక్టును సందర్శించి ఆయన సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ సభ ద్వారా ఓ మంచి సంప్రదాయానికి తెరతీద్దామని చెప్పారు. బై రోడ్డు బస్సులు పెట్టుకున్నామని బస్సుల్లో ప్రయాణానికి ఇబ్బంది అనుకుంటే బేగంపేట విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ రెడీ ఉందని.. కేసీఆర్ ను తీసుకెళ్తామని అన్నారు.
బీఆర్ఎస్ కు, మాజీ సీఎం కేసీఆర్ కి నా విజ్ఞప్తి..
మ్యాన్ మెయిడ్ వండర్ ను, న్యూయార్క్ టైం, డిస్కవరీ చానల్స్ కూడా ప్రదర్శించాయని చెప్పారు. కేసీఆర్ కూడా ప్రజలందరికీ వివరించి చెప్తే బాగుంటదన్నారు. తాజ్ మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించారు కాబట్టి దానిని తమకు వీనుల విందుగా చెప్తే బాగుంటుందన్నారు. కాళేశ్వరం ఏటీఎంగా మారింది.. మీ ఇంట్ల కనకవర్షం కురిసింది అని తాము అనదల్చుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. తప్పు జరిగిందా..? జరగలేదా..? దానికి విధించాల్సిన శిక్ష ఏందనేదని పై చర్చిద్దామని తెలిపారు. బాంబులు పెట్టి పేల్చారని, పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారని ఇసుక మీద కట్టిండ్రా లేదా అనేది ప్రజలు తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.