ఖాట్మండు: నేపాల్లో ఎయిర్ డైనస్టీ హెలికాఫ్టర్ క్రాష్ అయింది. నువాకోట్ జిల్లా శివపురి ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో పైలట్తో పాటు చాపర్లో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 1:57 సమయంలో సూర్య చౌర్ పర్వత శ్రేణుల సమీపంలో ఈ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఖాట్మండు నుంచి Syaphrubensi వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సీనియర్ కెప్టెన్ అరుణ్ మళ్లా హెలికాఫ్టర్ పైలట్గా ఉన్నారు. హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన మూడు నిమిషాల్లోనే గ్రౌండ్ స్టాఫ్తో కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్తో పాటు చైనా దేశస్తులు హెలికాఫ్టర్లో ఉన్నట్లు సమాచారం.
బుధవారం మధ్యాహ్నం 1:54 సమయానికి హెలికాఫ్టర్ ఖాట్మండు నుంచి బయల్దేరింది. సూర్య చౌర్ పర్వత శ్రేణుల సమీపంలోకి 1:57కి చేరుకుంది. ఆ తర్వాత నుంచి సిగ్నల్ కోల్పోయింది. హెలికాఫ్టర్ కుప్పకూలిపోవడంతో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. హెలికాఫ్టర్ పైలట్తో పాటు అందులో ప్రయాణించిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి.