మాస్కో : రష్యాలోని కమ్చత్కా ప్రాంతంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమయింది. దానిలో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఈమేరకు శనివారం రష్యా ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ హెలికాప్టర్ వాచ్‌కాజెట్స్ అగ్నిపర్వత సమీపంలో నుంచి బయలుదేరింది. కానీ, గమ్యస్థానం మాత్రం చేరుకోలేకపోయింది. ఏంఐ–8 అనేది 1960లో రూపొందించిన డబుల్ ఇంజిన్ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్‌ను విట్యజ్ ఏరో కంపెనీ ఆపరేట్ చేస్తోంది.