45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ

45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ

DRDOతయారు చేసిన 45లక్షల విలువైన హెలికాప్టర్ దొంగించపబడిందని..దాని ఆచూకీ ఇప్పటివరకు తెలిసి రాలేదని వచ్చిన వార్తలపై రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలపింగ్ ఆర్గనేజేషన్ (DRDO) తయారు చేసిన చినూక్ హెలికాప్టర్ డమ్మీ మోడల్ దొంగిలించబడిందని గతంలో కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. మీడియా కథనాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో 2020లో డిఫెన్స్ ఎక్స్ పో లో ఈ హెలికాప్టర్ ప్రదర్శించబడంది.ఈ  ప్రదర్శనలో లైఫ్ సైజ్ స్ట్రక్చర్ ను కలిగి ఉన్న ఈ హెలికాప్టర్ ను చూసేందుక జనం ఎగబడ్డారు..సెల్ఫీలు తీసుకున్నారు.  ఎగ్జిబిషన్ ముగిశాక దాన్ని అక్కడే ఉంచారు. దాని నిర్వహణ బాధ్యతను స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పగించారని మీడియా కథనాలు ప్రచురించాయి. 

గతేడాది (2023) డీఆర్ డీఏ  తయారు చేసిన చినూక్ హెలికాప్టర్ కనిపించకుండా పోయిందని, దానిని ఎవరు , ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్టేదని మీడియాలో ఆర్టికల్స్ వచ్చాయి. 

అయితే చినూక్ హెలికాప్టర్ అదృశ్యంపై క్లారిటీ ఇచ్చింది. DRDO ద్వారా అలాంటి హెలికాప్టర్ ను ప్రదర్శనలో పెట్టలేదని స్పష్టం చేసింది. మీడియా కథనాలు తప్పదారి పట్టించాయని ప్రకటించింది. 

2020లో లక్నో లో జరిగిన డిఫెన్స్ ఎక్స్ పోలో DRDO ఇన్ స్టాల్ చేసిన చినూక్ హెలికాప్టర్ మోడల్ గురించి వచ్చిన వార్తలు తప్పుడు వార్తలని తేల్చింది. చినూక్ హెలికాప్టర్ ను బోయింగ్ తయారు చేసింది. DRDO ఎప్పుడు కూడా ఇలాంటి హెలికాప్టర్లను ఇన్ స్టాల్ చేయలేదని సోషల్ మీడియా X ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

చినూన్ హెలికాప్టర్ మోడల్ స్క్రాప్ మేటీరియల్ తో తయారు చేయబడిందని, దాని విలువ రూ.45 లక్షలు ఉంటుందని నివేదికలు చెపుతున్నాయి.  మెయింటెనెన్స్ కోసం వర్క్ షాపుకు లక్నో మునిసిపల్ కార్పొరేషన్ గోమతినగర్ లోని పంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే హెలికాప్టర్ ను వర్క్ షాపు నుంచి కూడా రికవరీ చేయలేకపోయారట.